suma: నాతో పెళ్లికి ముందుగా ఎస్ చెప్పిన సుమ, ఆ తరువాత నో చెప్పింది: రాజీవ్ కనకాల

  • సుమను చూడగానే మనసు పారేసుకున్నాను
  •  నేను ఇష్టపడుతున్న విషయాన్ని తను గ్రహించింది
  •  నా మనసులోని మాటను ఆమెకి చెప్పేశాను 

నటుడిగా రాజీవ్ కనకాల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక యాంకర్ గా ఆయన భార్య సుమ ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది. సుదీర్ఘ కాలంగా ఇద్దరూ తమ హవాను కొనసాగిస్తూనే వున్నారు. తాజా ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. " సీరియల్స్ చేస్తున్నప్పుడే సుమను చూసి మనసు పారేసుకున్నాను. ఆమెనే పెళ్లి  చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.

నేను ఇష్టపడుతున్నాననే విషయం తను గ్రహించింది. నా మనసులోని మాటను సుమకు చెప్పేసి, మూడు నాలుగు రోజుల పాటు ఆమెకి కనిపించడం మానేశాను. ఆ తరువాత ఆమెనే కాల్ చేసి .. తన అంగీకారాన్ని తెలియజేసింది. ఆ తరువాత జరిగిన ఒక సంఘటన కారణంగా, 'ఇప్పుడే ఇలా అంటే పెళ్లి అయిన తరువాత ఎన్ని షరతులు పెడతాడో ఏమిటో' అని చెప్పేసి 'నో' అనేసింది. దాంతో నేనే నచ్చజెప్పి మళ్లీ ప్రసన్నం చేసుకోవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు. 

suma
rajeev kanakala
  • Error fetching data: Network response was not ok

More Telugu News