online streaming: ఆన్ లైన్ స్ట్రీమింగ్ పోర్టల్స్ కు ‘సుప్రీం’ షాక్!

  • ఆన్ లైన్ స్ట్రీమింగ్ పోర్టల్స్ లో అడ్డూఅదుపూ లేని ప్రసారాలు
  • ఆ పోర్టల్స్ కు మార్గదర్శకాలు రూపొందించాలి
  • కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు 

ఆన్ లైన్ మీడియా స్ట్రీమింగ్ పోర్టల్స్ కు మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి పోర్టల్స్ కు మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా, ఆన్ లైన్ మీడియా స్ట్రీమింగ్ పోర్టల్స్ కు సెన్సార్ సమస్య ఉండదు. వీటిలో ప్రసారమయ్యే అంశాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో ఇటీవలే ఓ పిటిషన్ కూడా దాఖలైంది.

  • Loading...

More Telugu News