guntur: ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు రావాలని ఎంపీ రాయపాటి యాగం

  • గుంటూరు మొర్జంపాడు బుగ్గమల్లేశ్వరస్వామి క్షేత్రంలో పూజలు
  • శతచండీ, మహాసుదర్శన యాగాలు నిర్వహిస్తున్న రుత్వికులు
  • ఐదో రోజు పూర్ణాహుతితో పూర్తికానున్న క్రతువు

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు తిరిగి ప్రమాణ స్వీకారం చేయాలని ఆకాంక్షిస్తూ నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఐదు రోజుల యాగం నిర్వహిస్తున్నారు. గుంటూరు మొర్జంపాడులోని బుగ్గమల్లేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం ప్రారంభమైన కార్యక్రమంలో రుత్వికులు శత చండీ, మహాసుదర్శన యాగాలు నిర్వహిస్తున్నారు. ఐదో రోజున పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమవుతుందని యాగ నిర్వాహకుడు శ్రీనివాసశర్మ తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ రాయపాటి మాట్లాడుతూ శ్రీశైలం క్షేత్రంతో సమానమైన ప్రాశస్త్యం ఉన్న బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయంలో యాగం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సీఎంగా మళ్లీ చంద్రబాబు రావాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతో ఈ క్రతువు నిర్వహణ చేపట్టినట్లు తెలిపారు.

guntur
MP rayapati
Satha chandi yagam
Chandrababu
  • Loading...

More Telugu News