chandrababu: చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తం.. తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే: లక్ష్మీపార్వతి

  • జగన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు
  • జగన్ సీఎం కావడాన్ని చూసి చంద్రబాబు కుమిలిపోతారు
  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని అడ్డుకుంటే న్యాయ పోరాటం చేస్తాం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని చెప్పారు. జగన్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. అన్ని ఛానళ్ల సర్వేలు జగన్ కే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. జగన్ సీఎం కాబోతున్నారని... అది చూసి చంద్రబాబు కుమిలిపోతారని అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తమయిందని చెప్పారు. తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని అన్నారు. ఈ నెల 19న విడుదల కానున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని... సినిమాను సినిమాలానే చూడాలని... అలా కాకుండా తమను ఇబ్బందికి గురి చేస్తే, న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

chandrababu
lakshmi parvathi
jagan
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News