sun: ఎండలు మండుతున్నాయ్.. ఈరోజు, రేపు.. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు!

  • నిప్పుల కుంపటిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు
  • నిన్న ప్రాణాలు కోల్పోయిన 16 మంది
  • ఈరోజు, రేపు తీవ్రమైన వడగాలులు

ఇరు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే భానుడి ప్రతాపానికి రెండు రాష్ట్రాల్లో 16 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎండ తీవ్రత ఈరోజు, రేపు కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. ఇదే సమయంలో ఒక చల్లటి కబురు అందించింది. రానున్న నాలుగు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

sun
heat
telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News