Raja Rani: 'రాజారాణి' సీరియల్ నటి రితికతో వివాహం జరిపించాలంటూ ఇంజినీరింగ్ విద్యార్థి బెదిరింపులు

  • నటి ఇంటికెళ్లి ఆమె తండ్రితో గొడవ
  • తనకిచ్చి పెళ్లి చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపు
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఓ టీవీలో ప్రసారం అవుతున్న రాజారాణి సీరియల్ నటి రితికతో తన వివాహం జరిపించాలంటూ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి హల్‌చల్ చేశాడు. చెన్నైలోని ఆమె ఇంట్లోకి ప్రవేశించిన విద్యార్థి.. రితికను తనకిచ్చి వివాహం చేయాలంటూ ఆమె తండ్రితో వాదులాటకు దిగాడు. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైలోని  వడపళని వందడుగుల రహదారి సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో రితిక తన తండ్రితో కలిసి నివసిస్తోంది.

 గోబిచెట్టిపాళెయానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి భరత్‌ గురువారం ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తెరిచిన రితిక తండ్రి సుబ్రహ్మణితో రితికను తనకు ఇచ్చి వివాహం చేయాలని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య వాదులాట జరిగింది. రితికను తనకిచ్చి వివాహం చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భరత్ ఆయనను బెదిరించాడు. గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భరత్ ఉద్యోగం కోసం చెన్నై వచ్చాడని తమ విచారణలో తేలినట్టు వివరించారు.

Raja Rani
TV serial
Tamil Nadu
chennai
  • Loading...

More Telugu News