Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కీర్తి సురేశ్ చేతిలో మరో సినిమా
  • ఫ్యామిలీతో బన్నీ హాలిడే ట్రిప్
  • మామా అల్లుళ్ల మరో చిత్రం 

*  ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలలో నటిస్తున్న కథానాయిక కీర్తి సురేశ్ తాజాగా ఓ తమిళ చిత్రాన్ని అంగీకరించింది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మించే ఈ చిత్రానికి నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తాడు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా ఇది రూపొందుతుంది.
*  ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం తాజా షెడ్యూల్ పూర్తయింది. దీంతో బన్నీ చిన్న బ్రేక్ తీసుకుని, కుటుంబంతో కలసి హాలిడే కోసం విదేశాలకు వెళ్లినట్టు సమాచారం.
*  మామా అల్లుళ్లు అయిన రజనీకాంత్, ధనుశ్ కలసి మరో చిత్రానికి పనిచేయనున్నారు. ఆమధ్య రజనీ హీరోగా ధనుశ్ 'కాలా' చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పుడు మరో సినిమా నిర్మించడానికి ప్రయత్నాలు మొదలెట్టాడు. దీనికి 'పేట' దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించే అవకాశం వుంది.

Keerthi
Allu Arjun
Trivikram
Rajanikanth
  • Loading...

More Telugu News