Telangana: మంద కృష్ణ మాదిగ వసూల్ రాజా.. గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం: పిడమర్తి రవి ఆరోపణ

  • మంద కృష్ణ వసూళ్లపై సీబీసీఐడీ విచారణ చేయాలి
  • అంబేద్కర్ గర్జనకు జాతీయ స్థాయి నేతలు రాలేదు
  • ఈ గర్జనలో పాల్గొన్న వారెవరూ అంబేద్కర్ వాదులు కాదు

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగపై తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంద కృష్ణ మాదిగ వసూల్ రాజా అని, అందుకే, ఆయన నిర్వహించిన అంబేద్కర్ గర్జనకు జాతీయ స్థాయి నేతలు రాలేదని విమర్శించారు. ఈ గర్జనలో పాల్గొన్న వారిలో ఎవరూ అంబేద్కర్ వాదులు కాదని విమర్శించారు. మంద కృష్ణ వసూళ్లపై సీబీసీఐడీ విచారణ చేయాలని కోరుతూ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎమ్మార్పీఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఎప్పుడైనా నిర్వహించారా? అని ప్రశ్నించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కచ్చితంగా ఏర్పాటు చేసి తీరతామని అన్నారు. 

Telangana
sc corporation
ex chairman
pidamarti
  • Loading...

More Telugu News