Andhra Pradesh: టీడీపీ హయాంలో ఉద్యోగులకు ఎలాంటి మేలు జరగలేదు: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

  • హెల్త్ కార్డులు ఏ కార్పోరేట్ ఆసుపత్రిలో పని చేయట్లేదు
  • చెల్లించాల్సిన డీఏ ఇంకా పెండింగ్ లోనే ఉంది
  • ప్రభుత్వం మేలు చేసినట్టుగా కొన్ని సంఘాలు చెబుతున్నాయి

టీడీపీ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్ కార్డులు ఏ కార్పోరేట్ ఆసుపత్రిలోనూ పనిచేయడం లేదని, ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ ఇంకా పెండింగ్ లోనే ఉందని ఆరోపించారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి మేలు చేయకపోయినా చేసినట్టుగా కొన్ని సంఘాల నేతలు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతుండటం విడ్డూరంగా ఉందని అన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. 

Andhra Pradesh
Telugudesam
government
suryanarayana
  • Loading...

More Telugu News