Ravi Prakash: టీవీ9 ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తి ఇంట్లో సోదాలు

  • రవిప్రకాశ్, శివాజీ ఇంట్లో సోదాలు
  • టీవీ9 ఛానల్‌లో 1.5 శాతం వాటాలు
  • మూర్తికి నోటీసుల జారీ

టీవీ 9 యాజమాన్య మార్పిడి, వాటాల అమ్మకానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే ఆ ఛానల్ సీఈవో రవి ప్రకాశ్, సినీ నటుడు శివాజీ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. నేటి సాయంత్రం టీవీ9 ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తి ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. మూర్తికి టీవీ9 ఛానల్‌లో 1.5 శాతం వాటాలు వున్నట్టు చెబుతున్నారు.

అలాగే రేపు ఉదయం విచారణకు హాజరు కావాలని రవి ప్రకాశ్, శివాజీతో పాటు మూర్తికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా టీవీ9 కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించిన పోలీసులు ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్టు తెలిపారు.

Ravi Prakash
Murthy
Shivaji
TV9
Laptop
Police
  • Loading...

More Telugu News