Preethi Jinta: 'మీ కూతురిని కిడ్నాప్ చేస్తా'నంటూ ధోనీకి ప్రీతిజింటా స్వీట్ వార్నింగ్

  • మిస్టర్ కూల్ అభిమానులలో నేనూ ఒకరిని 
  • మీ కూతురు జీవాపై అభిమానం పెంచుకున్నా
  • జాగ్రత్తగా వుండండి మరి 

చెన్నై సూపర్ కింగ్ సారధి ధోనికి ప్రీతి జింటా వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం కింగ్స్ పంజాబ్‌కి యజమానిగా ఉన్న ఆమె తాజాగా ధోనీతో కలిసి ఫొటోకు పోజిచ్చింది. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఫొటోతో పాటు ఆమె వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ధోనీ కూతురు జీవాపై తనకు అభిమానం పెరిగిపోతోందని, కాబట్టి ఆమెను కిడ్నాప్ చేస్తానంటూ ప్రీతి జింటా ఇచ్చిన స్వీట్ వార్నింగ్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

‘‘మిస్టర్ కూల్ కి నాతో పాటుగా ఎంతోమంది అభిమానులున్నారు. అయితే, ఈమధ్య ఆయన ముద్దుల చిన్నారి జీవాపై నాలో అభిమానం పెరిగిపోతోంది. అందుకే, అతనికి జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తున్నాను.. జీవాను నేను కిడ్నాప్ చేసినా చేయచ్చు..' అంటూ ప్రీతి తన ట్వీట్‌లో సరదాగా రాసుకొచ్చింది.

Preethi Jinta
Dhoni
Kings Punjab
Chennai Super Kings
Jeeva
  • Loading...

More Telugu News