sangreddy: ఈ నెల 25 నుంచి 30 లోపు గాంధీ భవన్ లో ఉంటానో? టీఆర్ఎస్ భవన్ లో ఉంటానో?: జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

  • కేసీఆర్, కేటీఆర్ బంధువులు నన్ను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు
  • నేను ఏ పార్టీలో ఉన్నా పార్టీ చెప్పింది సగమే వింటా
  • మిగిలిన సగం నా సొంత నిర్ణయాలే ఉంటాయి

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ బంధువులు తనను టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారని అన్నారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీ లోపు తాను గాంధీభవన్ లో ఉంటానో లేక టీఆర్ఎస్ భవన్ లో ఉంటానో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు.

కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్ లో ఉంటుందని అన్నారు. రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ దెబ్బతిందని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నా పార్టీ చెప్పింది సగమే వింటానని, మిగిలిన సగం తన సొంత నిర్ణయాలే ఉంటాయంటూ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. స్వశక్తితో ఎదిగానని, పార్టీ బ్యానర్ పై ఆధారపడి గెలిచిన నేతను కాదని వ్యాఖ్యానించారు. 

sangreddy
congress
mla
jagga reddy
TRS
  • Loading...

More Telugu News