umesh jadhav: నా కూతురు ఫెయిల్ కావడానికి కాంగ్రెస్ నేతలే కారణం: బీజేపీ నేత

  • డబ్బు తీసుకుని బీజేపీలో చేరానని ప్రచారం చేశారు
  • దీని ప్రభావం నా కూతురుపై పడింది
  • పరీక్షలు సరిగా రాయలేకపోయింది

రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారానని కర్ణాటకలోని కలబుర్గి బీజేపీ అభ్యర్థి ఉమేష్ జాదవ్ అన్నారు. అయితే, భారీగా డబ్బు తీసుకుని పార్టీ మారానంటూ కాంగ్రెస్ నేతలు తనపై అసత్య ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరోపణలతో తన కుమార్తె చాలా ఇబ్బంది పడిందని... కాలేజీలో తోటి విద్యార్థులు ఆమెని ఒకలా చూశారని... దీంతో, మానసికంగా ఇబ్బంది పడి, పరీక్షలు సరిగా రాయలేకపోయిందని చెప్పారు. పీయూసీ పరీక్షలో ఫెయిల్ అయిందని... దీనికంతా కారణం కాంగ్రెస్ నేతలే అని మండిపడ్డారు.

umesh jadhav
daughter
fail
bjp
  • Loading...

More Telugu News