keerthi suresh: క్రితం ఏడాది ఇదే రోజున విడుదలైన 'మహానటి' .. అందరికీ ధన్యవాదాలు తెలిపిన కీర్తి సురేశ్

- 'మహానటి'లో నటించడం నేను చేసుకున్న అదృష్టం
- నాపై నమ్మకంతో సావిత్రిగారి పాత్రను ఇచ్చారు
- మీరిచ్చిన ప్రోత్సాహంతోనే నా పాత్రకి న్యాయం చేశాను
తెలుగు తెర చందమామగా అభిమానులతో నీరాజనాలు అందుకున్న సావిత్రి, ఆ తరువాత తన జీవితాన్ని విషాదాంతం చేసుకున్నారు. అలాంటి సావిత్రి జీవితాన్ని 'మహానటి' పేరుతో .. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. క్రితం ఏడాది ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
