Andhra Pradesh: గత 70 ఏళ్లలో అస్సలు జవాబుదారీతనం లేని ప్రధాని మోదీనే!: సీఎం చంద్రబాబు ధ్వజం

  • ఐదేళ్లలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్సూ పెట్టలేదు
  • వ్యవస్థల మధ్య అంతః కలహాలు తెచ్చారు
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన ఏపీ సీఎం

భారతదేశం గత 70 ఏళ్లలో చూసిన ప్రధానమంత్రుల్లో అస్సలు జవాబుదారీతనం లేని వ్యక్తి నరేంద్ర మోదీయేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ విషయాన్ని మీడియా కూడా చెబుతోందన్నారు. కనీసం ఓ ప్రెస్ కాన్ఫరెన్సు కూడా పెట్టని ప్రధాని మోదీ తప్ప మరెవరూ లేరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అంతేకాకుండా రాజ్యాంగ వ్యవస్థల మధ్య అంతఃకలహాలు రేపిన ఘనత కూడా మోదీదేనని దుయ్యబట్టారు.

ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ.. ‘బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశారు. ఏటిఎంలను దిష్టిబొమ్మలుగా చేశారు. డిమానిటైజేషన్ పెద్ద కుంభకోణంగా మార్చారు. వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ) సక్రమంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. రూపాయి విలువ దారుణంగా పతనం అయ్యింది. 72 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇంత విఫల ప్రధానిని చూడలేదు’ అని ఘాటుగా విమర్శించారు.

గతడాది సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా సమావేశం పెట్టడంపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో మొదటిసారి నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బయటికొచ్చి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. దేశచరిత్రలో తొలిసారి సాక్షాత్తూ రక్షణశాఖ కార్యాలయంలోనే దేశ భద్రతకు సంబంధించిన పత్రాలు(రాఫెల్) మాయం కావడం ఎప్పుడైనా జరిగిందా?’ అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News