CEC: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రద్దు చేయాలి: సీఈసీకి ఉత్తమ్ లేఖ

  • ఈ లేఖను అత్యవసర అంశంగా పరిగణించాలి
  • ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?
  • ఈ జాబితా సిద్ధమయ్యే వరకు ఎన్నికలు నిర్వహించొద్దు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలు వాయిదా వేయాలని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు  కేంద్ర ఎన్నికల సంఘం  ప్రధాన కమిషనర్ (సీఈసీ) అరోరాకు ఓ లేఖ రాశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ ద్వారా నిన్న సీఈసీకి లేఖ పంపిన ఉత్తమ్ తాజాగా మరో లేఖ రాశారు. ఇప్పటివరకూ స్థానిక సంస్థల ఓటర్ల జాబితా అందుబాటులో లేదని అన్నారు. రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటన విడుదల చేశారని ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితా సిద్ధమయ్యే వరకూ ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించొద్దని విజ్ఞప్తి చేశారు. తన లేఖ సారాంశాన్ని అత్యవసర అంశంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటనను రద్దు చేయాలని ఆ లేఖలో కోరారు. 

  • Loading...

More Telugu News