harassment: ప్రేమించాలని సైకో వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న పీయూసీ అమ్మాయి!

  • కర్ణాటకలోని బెంగళూరులో ఘటన
  • లీనాకు క్లాస్ మేట్ వేధింపులు
  • బాధితురాలిని బెదిరిస్తున్న వీడియోలు స్వాధీనం

తనను ప్రేమించాలని వెంటపడ్డాడు. తనకు ఇలాంటివి ఇష్టం లేదని యువతి చెప్పినా వినిపించుకోలేదు. చివరికి ప్రేమకు ఒప్పుకోకపోవడంతో వీధుల్లో వెంటపడి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన యువతి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని బెంగళూరులో గత మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నగరంలోని కేఆర్‌ పురంలో లీనా(17) అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. రామ్మూర్తినగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఆమె పీయూసీ చదువుతోంది. ఈ నేపథ్యంలో అదే కాలేజీకి చెందిన మంజునాథ్ అనే యువకుడు తనను ప్రేమించాలని లీనా వెంటపడటం మొదలుపెట్టాడు. తనకు ఇలాంటివి ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోకుండా వెంటపడి వేధించడం మొదలుపెట్టాడు.

దీంతో మానసికంగా కుంగిపోయిన లీనా మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో లీనా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేశారు. లీనాను మంజునాథ్ బెదిరిస్తున్న సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.

harassment
Karnataka
banglore
girl suicide
puc student
  • Loading...

More Telugu News