Andhra Pradesh: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరి మృతి

  • విశాఖపట్టణం నుంచి అమరావతి వెళ్తున్న బస్సు
  • రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజ్ సమీపంలో ఘటన
  • గంటల తరబడి నిలిచిపోయిన ట్రాఫిక్

ఏలూరులో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విశాఖపట్టణం నుంచి అమరావతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇనుప లోడుతో ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.

మెయిన్ బైపాస్ రోడ్డులోని రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజ్ సమీపంలో జరిగిన ఈ ఘటనతో ట్రాఫిక్ ఒక్కసారిగా జామైంది. బస్సు ఢీకొనడంతో లారీలోని ఐరన్ లోడు మొత్తం రోడ్డుపై చెల్లాచెదరుగా పడిపోవడంతో గంటల తరబడి వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh
Amravathi
Visakhapatnam District
RTC bus
Road Accident
  • Loading...

More Telugu News