Maharshi: ‘మహర్షి’ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా విషాదం.. కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

  • నేడు విడుదల కానున్న మహర్షి సినిమా
  • ఫ్లెక్సీ కడుతుండగా తాకిన విద్యుత్ తీగలు
  • అక్కడికక్కడే మృతి

టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమా నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ఫ్లెక్సీ కడుతూ మహేశ్ అభిమాని ఒకరు మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో జరిగిందీ ఘటన. స్థానిక మురళీకృష్ణ థియేటర్‌లో సినిమా ఫ్లెక్సీ కడుతున్న ఎర్రంశెట్టి రాజీవ్ (26) అనే యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించేలోగానే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Maharshi
Mahesh Babu
Tollywood
Rajamahendravaram
Andhra Pradesh
  • Loading...

More Telugu News