Nasrath Jahan: అభిమాన నటితో సెల్ఫీల కోసం ఎగబడిన జనం.. ఒక్కసారిగా కుప్పకూలిన వేదిక

  • బీర్బాహాకు మద్దతుగా నస్రత్ ప్రచారం
  • అభిమాన నటిని చూసి ముచ్చటపడిన జనం
  • అభిమానుల తాకిడి పెరగడంతో ఘటన

తమ అభిమాన నటి వేదికపై కనిపించగానే జనం ఆనందంతో ఉప్పొంగిపోయారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడటంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ నేత నస్రత్ జహాన్ జార్ గ్రామ్ నుంచి పోటీ చేస్తున్న బీర్బాహా సోరేన్‌కు మద్దతుగా నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో మురిసిపోయిన బెంగాలీలు తమ అభిమాన నటితో ఎలాగైనా సెల్ఫీ దిగాలని ముచ్చట పడ్డారు. అభిమానుల తాకిడి పెరగడంతో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Nasrath Jahan
Beerbaha Soren
TMC
West Bengal
Selfie
  • Loading...

More Telugu News