Durgamma: వరుసకు మనవరాలైన బాలికపై అత్యాచారం.. మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

  • దుర్గమ్మను రెండో పెళ్లి చేసుకున్న మొగలయ్య
  • బాలికను లోబరుచుకున్న మల్లేశ్
  • నష్ట పరిహారం చెల్లించాలని తీర్మానించిన పెద్దలు

వరుసకు మనవరాలైన బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని గర్భవతిని చేయడంతో ఆమె మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు తెలిపారు. హైదరాబాద్ మీర్‌పేట్‌లోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన మొగలయ్యకు ముగ్గురు కుమార్తెలున్నారు. 2008లో భార్య చనిపోవడంతో మిర్యాలగూడకు చెందిన దుర్గమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు.

దీంతో దుర్గమ్మ మేనమామ మల్లేశ్, మొగలయ్య ఇంటికి వచ్చి పోయే క్రమంలో ఆయన రెండో కుమార్తె(17)కు మాయమాటలు చెప్పి లోబరుచుకుని బాలికను గర్భవతిని చేశాడు. దీంతో స్థానిక పెద్దలు బాలికకు నష్టపరిహారాన్ని చెల్లించాలని తీర్మానించారు. వీటన్నింటి నేపథ్యంలో మనస్తాపానికి గురైన బాలిక మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

Durgamma
Mallesh
Mogalayya
Suicide
Police
  • Loading...

More Telugu News