aprtc: ఏపీఎస్ఆర్టీసీలో మళ్లీ సమ్మెకు సిద్ధమవుతున్న కార్మికులు!
- ఆర్టీసీ యాజమాన్యానికి ఎంఎంయూ సమ్మె నోటీసు
- 46 డిమాండ్లు నెరవేర్చాలంటున్న ఎన్ఎంయూ
- సమస్యలు పరిష్కరించకుంటే 22 తర్వాత సమ్మె
ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మళ్లీ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్ఎంయూ సమ్మె నోటీసు ఇచ్చింది. 46 డిమాండ్లతో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు ఈ నోటీసు ఇచ్చింది. కార్మికుల వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలన్నది ప్రధాన డిమాండ్ గా ఉంది. సిబ్బంది కుదింపు, గ్రాట్యూటీ తగ్గింపు, అద్దె బస్సుల పెంపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని ఎన్ఎంయూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 22 తర్వాత సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది.