rajani: 'దర్బార్' కోసం రంగంలోకి మరో విలన్

  • రజనీ 167వ సినిమాగా 'దర్బార్'
  • పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న రజనీ
  • వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు       

రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' సినిమా రూపొందుతోంది. రజనీకి ఇది 167వ సినిమా. ఇందులో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఆయన సరసన కథానాయికగా నయనతార .. కూతురుగా నివేద థామస్ నటిస్తున్నారు. ఇక ప్రతినాయకుడి పాత్రకిగాను ప్రతీక్ బబ్బర్ ను తీసుకున్నారు.

ఈ సినిమాకి ఆయన మాత్రమే విలన్ అని అంతా అనుకున్నారు. కానీ కథ ప్రకారం ఈ సినిమాలో మరో ప్రతినాయక పాత్ర ఉందట. ఈ పాత్రను మురుగదాస్ వైవిధ్యభరితంగా మలిచాడట. ఈ పాత్రకి మలయాళ నటుడు 'చెంబన్' వినోద్ జోస్ అయితే సరిగ్గా సరిపోతాడని భావించి, ఆయనను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. 'గోలీసోడా 2' సినిమాతో ఆయన తమిళ ప్రేక్షకులకు చేరువయ్యారు. పొలిటికల్ థ్రిల్లర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. 

rajani
nayanatara
niveda thomas
  • Loading...

More Telugu News