vijay devarakonda: విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' విడుదల తేదీ ఖరారు

  • భరత్ కమ్మ నుంచి 'డియర్ కామ్రేడ్'
  • మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ
  •  క్రికెటర్ గా రష్మిక మందన 

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ జోడీగా రష్మిక మందన నటిస్తోంది. మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ .. క్రికెటర్ గా రష్మిక నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. జూలై 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. మైత్రీ మూవీ మేకర్స్ - బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా తెరకెక్కిన 'గీత గోవిందం' సంచలన విజయం సాధించడంతో, సహజంగానే 'డియర్ కామ్రేడ్'పై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

  • Loading...

More Telugu News