anupam kher: అనుపమ్ ఖేర్ కు చేదు అనుభవం

  • చండీగఢ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనుపమ్ ఖేర్ భార్య
  • ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న సినీ నటుడు
  • ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించిన ఓ షాపు ఓనర్

బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత అనుపమ్ ఖేర్ కు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సరిగ్గా రెండు రోజుల క్రితం జనాలు లేక ఆయన సభ రద్దయింది. ఈ రోజు ఆయనకు మరో షాక్ తగిలింది.

అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ చండీగఢ్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. దీంతో, ఆమె తరపున అనుపమ్ ఖేర్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఆయన ఒక షాపులోకి వెళ్లారు. బీజేపీకి ఓటు వేయాలని షాపు ఓనరును కోరారు. అయితే... బీజేపీ ఏం చేసిందని ఓటు వేయాలి? మీకు ఎందుకు ఓటు వేయాలని సదరు షాపు యజమాని ప్రశ్నించాడు. అంతేకాదు 2014లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను చూపించి... వీటిలో ఒక్కటైనా నెరవేర్చారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇక చేసేందేం లేక... అనుపమ్ ఖేర్ అక్కడి నుంచి బయటకు వచ్చేశారు.

anupam kher
bjp
chandigarh
  • Loading...

More Telugu News