mlc: ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ను రద్దు చేయాలి.. సీఈసీకి దాసోజ్ శ్రవణ్ ఫిర్యాదు

  • ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ పై అభ్యంతరం
  • అర్ధరాత్రి సమయంలో ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారు
  • తెల్లవారుజాము నుంచే నామినేషన్లు స్వీకరించారు

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ పై టీ కాంగ్రెస్ నేత దాసోజ్ శ్రవణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరాని ఈరోజు ఆయన కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ పై ఉన్న అభ్యంతరాలపై ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి షెడ్యూల్ ఇచ్చి తెల్లవారుజాము నుంచే నామినేషన్లు స్వీకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశామని, ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరినట్టు చెప్పారు. అన్ని విషయాలు పరిశీలిస్తామని సీఈసీ తమకు హామీ ఇచ్చినట్టు దాసోజ్ శ్రవణ్ కుమార్ చెప్పారు.

mlc
elections
cec
tcongress
dasoj
sravan
  • Loading...

More Telugu News