hollywood: అవతార్-2 రిలీజ్ తేదీని ప్రకటించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్!

  • 2009లో వచ్చిన అవతార్-1
  • ఈ సిరీస్ లో మరో 4 సీక్వెల్స్ కు సన్నాహాలు
  • ట్విట్టర్ లో ప్రకటించిన దర్శకుడు

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ 2009లో తెరకెక్కించిన అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. సహజవనరుల కోసం మనుషులు పాండోరా గ్రహానికి వెళ్లడం, అక్కడ నావీ అనే జాతికి చెందిన జీవులతో యుద్ధం, వారికి హీరో సాయం చేయడం వంటి ఆసక్తికరమైన మలుపులతో సినిమాను కామెరూన్ అద్భుతంగా తీర్చిదిద్దారు.

అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా మరో 4 సీక్వెల్స్ ఉంటాయని అప్పట్లోనే కామెరూన్ ప్రకటించారు. తాజాగా అవతార్-2కు సంబంధించిన తేదీని ఆయన ప్రకటించారు.

2021, డిసెంబర్ 17న తాము అవతార్-2ను రిలీజ్ చేస్తామని కామెరూన్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రకటించారు. ఈ సినిమాకు టైటిల్ ను కామెరూన్ ప్రకటించనప్పటికీ..‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ అనే పేరును ఖరారు చేయవచ్చని హాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

ఈ సినిమా ప్రధానంగా పాండోరా గ్రహంపై ఉన్న సముద్రాలపై ఉంటుందని పేర్కొన్నాయి. అవతార్-1 సినిమాను రూ.1,648 కోట్లతో తెరకెక్కించగా, ఏకంగా రూ.రూ.20,455 కోట్ల కలెక్షన్లు సాధించి చరిత్ర సృష్టించింది.

hollywood
avatar-2
james cameron
Twitter
date release
  • Loading...

More Telugu News