Road Accident: జాతీయ రహదారిపై అదుపుతప్పిన గ్యాస్‌ ట్యాంకర్‌.. ఆరుగురికి తీవ్రగాయాలు

  • ఇద్దరి పరిస్థితి విషమం
  • రోడ్డు పక్కన షాపుల్లోకి దూసుకువెళ్లిన వాహనం
  • గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద ఘటన

జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ గ్యాస్‌ ట్యాంకర్‌ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న షాపుల్లోకి దూసుకు వెళ్లిన ఘటనలో ఆరుగురు గాయపడగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈరోజు తెల్లవారు జామున గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీకి చెందిన ఈ ట్యాంకర్‌ వేగంగా వస్తూ దాచేపల్లి వద్ద అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న షాపులను పాక్షికంగా ధ్వంసం చేస్తూ దూసుకువెళ్లింది. ఈ సమయంలో అక్కడ ఉన్న ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. ప్రమాద ఘనటకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Road Accident
Guntur District
dachepalli
gas tanker
  • Loading...

More Telugu News