mamata banerjee: మమతా బెనర్జీ.. ఈ రోజుతో మీరు అన్ని లిమిట్స్ దాటిపోయారు: సుష్మా స్వరాజ్

  • ప్రధాని మోదీకి ప్రజాస్వామ్యం చెంపదెబ్బ రుచి చూపాలన్న దీదీ 
  • ఎప్పుడూ ద్వేష భావంతో ఉండటం ఎందుకన్న సుష్మ
  • ఇలా ప్రవర్తించడానికి సిగ్గుపడటం లేదా? అని ప్రశ్న

పశ్చిమబెంగాల్ లోని పురూలియాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తూ... ప్రధాని మోదీకి ప్రజాస్వామ్యం చెంపదెబ్బ ఎలాంటిదో రుచి చూపాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. ఈ రోజుతో మమతా బెనర్జీ అన్ని పరిమితులను దాటిపోయారని మండిపడ్డారు.

'మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మోదీ దేశానికి ప్రధానమంత్రి. రేపు మీరు ఆయనతో మాట్లాడాల్సి ఉంటుంది' అని అన్నారు. ఎప్పుడూ ద్వేష భావంతోనే ఉండటం ఎందుకని ప్రశ్నించారు. ఏదో ఒక రోజు మనం మళ్లీ స్నేహితులం కావాల్సిందే అని తెలిసినా ఇలా ప్రవర్తించడానికి సిగ్గుపడటం లేదా? అని ప్రశ్నించారు.  

mamata banerjee
sushma swaraj
modi
tmc
bjp
  • Loading...

More Telugu News