Andhra Pradesh: ఈవీఎంలు, వీవీప్యాట్స్ లెక్కించాక ఆ వివరాలు వెబ్ సైట్ లో పెట్టాలి: సీఎం చంద్రబాబు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-107e1098e4da357d1cda5a127ba1dbc2641952a2.jpg)
- ఇలా చేయడం ద్వారా ఆ వివరాలు ప్రజలకు తెలుస్తాయి
- ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండాలి
- విశ్వసనీయత కాపాడాల్సిన బాధ్యత ఈసీపై ఉంది
ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ లెక్కించాక వాటి వివరాలను వెబ్ సైట్ లో ఉంచాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. వీవీప్యాట్స్ లెక్కింపు, ఈవీఎంల అంశంపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) అరోరాకు ఫిర్యాదు చేశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇలా చేయడం ద్వారా మీడియాకు, ప్రజలకు ఆ వివరాలు తెలుస్తాయని అన్నారు.
ప్రజాస్వామ్యంలో పారదర్శకతతో పాటు బాధ్యతాయుతంగా ఉండాలని, విశ్వసనీయతను పెంపొందించాలని అన్నారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతే ఓట్లు వేసే పరిస్థితి కూడా ఉండదని అభిప్రాయపడ్డారు. ఏపీలో ఎనభై శాతం మంది ఓటు వేశారని, కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ ఓటర్లు వాటిని పట్టించుకోకుండా ఓట్లు వేశారని గుర్తుచేశారు. ఆ విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ఈసీపై ఉందని అన్నారు.