USA: ఉద్యోగులను అమెరికా పంపే భారత ఐటీ కంపెనీలపై ఇక పెనుభారం తప్పదు!

  • హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుపు పెంపు యోచనలో ట్రంప్
  • బడ్జెట్ లో ప్రతిపాదనలు చేసిన యూఎస్ సర్కారు  
  • ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై కఠిన నిబంధనలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా భారత్ వంటి దేశాల నుంచి అమెరికాలోకి కొనసాగుతున్న మేధో వలసలపై ఆయన కఠిన ఆంక్షలు ప్రవేశపెట్టారు. అందుకు హెచ్-1బీ వీసాను ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకుంటున్న ట్రంప్ ఇప్పటికే దానిపై అనేకరకాలుగా కఠిన నిబంధనలు తీసుకువచ్చారు. తాజాగా, హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుము పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 2020 సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ లో ప్రతిపాదనలు చేర్చారు.

ఏఏ కేటగిరీల వ్యక్తులకు ఈ పెంపు వర్తిస్తుందో స్పష్టం చేయకపోయినా, దీని కారణంగా భారతీయ ఐటీ కంపెనీలపై భారం పడనుందని తెలుస్తోంది. తమ ఉద్యోగులను అమెరికా పంపాలనుకునే భారత ఐటీ సంస్థలు హెచ్-1బీ దరఖాస్తు రుసుంను భరించాల్సి ఉంటుంది. ఇది ఆయా సంస్థలకు అదనపు భారంగా పరిణమించనుంది. కాగా, ఈ పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని అమెరికా యువతకు సాంకేతికపరమైన అంశాల్లో శిక్షణ ఇచ్చే అప్రెంటిస్ ప్రోగ్రామ్ కోసం వినియోగించనున్నారు.

  • Loading...

More Telugu News