Andhra Pradesh: అమరావతిలో ఈదురుగాలులతో వర్షం!

  • సచివాలయం ప్రాంగణంలోని ‘స్మార్ట్ పోల్’ నేల కూలింది
  • గాలులకు ఎగిరిపోయిన రేకులు
  • రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన ‘స్మార్ట్ పోల్’ 

ఏపీ రాజధాని అమరావతిలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలుల కారణంగా సచివాలయం ప్రాంగణంలో రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్ (ఆర్టీజీఎస్సీ) కోసం ఏర్పాటు చేసిన ‘స్మార్ట్ పోల్’ కూలిపోయింది. సచివాలయంలోని రెండో, నాలుగు బ్లాక్ ల్లోని టెర్రస్ లపై రేకులు ఎగిరిపోయాయి. సుమారు ఐదు నిమిషాల పాటు ఈదురు గాలులు వీచాయి. ‘స్మార్ట్ పోల్’ ను రూ.25 లక్షలతో ఏర్పాటు చేసినట్టు సమాచారం. హైకోర్టు వద్ద ఉన్న క్యాంటీన్ పైకప్పు రేకులు ఎగిరి కిందపడే సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళకు ఈ రేకులు తగిలి గాయాలయ్యాయి. ఆ మహిళను సమీప ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

Andhra Pradesh
amaravathi
secretariat
rain
  • Loading...

More Telugu News