Andhra Pradesh: వెంకట్రావ్.. నీ భార్య నీమీద వరకట్నం వేధింపుల కేసు పెట్టలేదా?: వల్లభనేని వంశీ

  • ఆయనపై ఎస్సీ,ఎస్టీ కేసులున్నాయి
  • వైసీపీ నేతలంతా అల్లరిమూకలు
  • తెల్లదుస్తులు వేసుకోగానే నాయకులు అయిపోరు

వైసీపీ గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంకట్రావు నిజంగా మంచి వ్యక్తి అయితే ఆయనపై ఎస్సీ,ఎస్టీ వేధింపుల కేసులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అంత మంచివాడే అయితే సొంత భార్య యార్లగడ్డ వెంకట్రావుపై వరకట్నం వేధింపుల కేసు ఎందుకు పెట్టిందని నిలదీశారు.

విజయవాడలో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడారు. వైసీపీ నేతలంతా అల్లరిమూకలనీ, వారి ఆలోచనావిధానం అలాగే ఉంటుందన్నారు. ఇండిపెండెంట్ల చేతిలో ఓడిపోయిన వ్యక్తుల రాజకీయాలు ఇలాగే ఉంటాయని వెంకట్రావును దెప్పిపొడిచారు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పెద్ద మనుషులు అయిపోరని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Vijayawada
Telugudesam
YSRCP
venkatrao
vallbhaneni vamsi
  • Loading...

More Telugu News