chris gayle: వెస్టిండీస్ వరల్డ్ కప్ టీమ్ వైస్ కెప్టెన్ గా క్రిస్ గేల్

  • వెస్టిండీస్ కు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్న గేల్
  • జట్టులోని అందరికీ సహకరించడం తన బాధ్యతన్న డ్యాషింగ్ బ్యాట్స్ మెన్
  • కప్ ను గెలుపొందేందుకు ప్రయత్నిస్తామన్న గేల్

వెస్టిండీస్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ కు ప్రమోషన్ లభించింది. ప్రపంచకప్ జట్టుకు వైస్ కెప్టెన్ గా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. జాసన్ హోల్డర్ కెప్టెన్ బాధ్యతలను నెరవేర్చనున్నాడు. మరోవైపు, ఈ ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ వన్డేలకు గేల్ గుడ్ బై చెప్పనున్నాడు.

ఈ సందర్భంగా 39 ఏళ్ల జమైకన్ క్రికెటర్ గేల్ మాట్లాడుతూ, ఏ ఫార్మాట్లో అయినా వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తనకు ఎంతో గర్వకారణమని చెప్పాడు. ఇక ప్రపంచకప్ అయితే మరీ ప్రత్యేకమని తెలిపాడు. కెప్టెన్ సహా జట్టులోని ఆటగాళ్లందరికీ సహకరించడం ఒక సీనియర్ ఆటగాడిగా తన బాధ్యత అని చెప్పాడు. త్వరలో జరగనున్న ప్రపంచకప్ అతి పెద్ద టోర్నీ అని... ఎన్నో అంచనాలు ఉన్నాయని... వెస్టిండీస్ ప్రజలు సంతోషించేలా, కప్ ను గెలుపొందేందుకు తమ వంతు ప్రయత్నాలను తాము చేస్తామని తెలిపాడు.

chris gayle
west indies
vice captain
world cup
  • Loading...

More Telugu News