Chandrababu: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైసీపీ నేత నాగిరెడ్డి

  • అందుకే, ఈవీఎంలపై నెపం వేసే యత్నం
  • ఓటమి భయంతోనే ఈసీ, సీఎస్ లపై బాబు గొడవ
  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్నారు

ఏపీలో టీడీపీ ఓటమి పాలవుతుందన్న భయం చంద్రబాబుకు పట్టుకుందని, అందుకే, ఈవీఎంలపై నెపం వేసేందుకు ఆయన యత్నిస్తున్నారని వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓటమి భయంతోనే ఈసీ, సీఎస్ లతో బాబు గొడవకు దిగుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక పక్క టీడీపీకి 150 సీట్లు వస్తున్నాయని చెబుతున్న చంద్రబాబు, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ మతిభ్రమించినట్టుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈవీఎంలను ఉపయోగించిన విషయాన్ని బాబు మర్చిపోయారా? అని ఆయన ప్రశ్నించారు.

Chandrababu
ysrcp
nagireddy
  • Loading...

More Telugu News