Chandrababu: మనకు కింగ్ ఉన్నప్పుడు.. కింగ్ మేకర్ ఎందుకు?: చంద్రబాబు, కేసీఆర్ లను ఉద్దేశించి రాంమాధవ్

  • తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కువ సీట్లను గెలుచుకుంటుంది
  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ సాధిస్తుంది
  • బాబు, కేసీఆర్ లు కింగ్ మేకర్లు కావాలని కలలు కంటున్నారు

తూర్పు, ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువ సీట్లను గెలుచుకోవడం ద్వారా బీజేపీ కావాల్సినంత మెజార్టీ సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరొకరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదని... తమ గెలుపుపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వంటి నేతలు కింగ్ మేకర్లు కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మనకు కింగ్ (మోదీ) ఉన్నప్పుడు... కింగ్ మేకర్లతో అవసరం ఏంముందని ప్రశ్నించారు.

జాతీయ స్థాయిలో మహాకూటమి గెలుపు కోసం చంద్రబాబు కృషి చేస్తుండగా... ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాంమాధవ్ ఈ మేరకు స్పందించారు.

Chandrababu
kcr
modi
ram madhav
king maker
  • Loading...

More Telugu News