Andhra Pradesh: ఒడిశాకు ఏపీ ఆపన్నహస్తం.. 2,055 మంది సిబ్బందిని రంగంలోకి దించిన చంద్రబాబు!

  • ఒడిశాలో కొనసాగుతున్న ఫణి సహాయక చర్యలు
  • విద్యుత్ పునరుద్ధరణ కోసం రంగంలోకి ఏపీ నిపుణులు
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు 

ఓ మంచి పొరుగురాష్ట్రంగా ఒడిశాకు అవసరమైన సాయం అందజేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పెను తుపాను ‘ఫణి’తో అతలాకుతలం అయిన ఒడిశాలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ నుంచి  2,055 మంది సిబ్బంది, షిఫ్ట్ ఆపరేటర్లు, విద్యుత్ నిపుణులను ఒడిశాకు పంపామని పేర్కొన్నారు. వీరి సాయంతో ఒడిశాలో విద్యుత్ వసతిని త్వరితగతిన పునరుద్ధరించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చంద్రబాబు ఈరోజు ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Odisha
phoni
  • Loading...

More Telugu News