Yogi Adityanath: యూపీలో ఈద్‌కే కరెంటు ఉండేది.. దసరాకు వుండేది కాదు!: యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు
- గత పాలకులు ఈద్‌కు మాత్రమే కరెంటు ఇచ్చేవారు
- హోలీ, దీపావళికి కరెంటు ఇచ్చేవారు కాదు
- సోదరే లేని శివపాల్‌కు అత్త ఎక్కడి నుంచి వచ్చిందో?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధార్థ్‌నగర్ జిల్లా దోమరాయగంజ్‌లో యోగి మాట్లాడుతూ.. 'గతంలో యూపీలో నాలుగైదు జిల్లాల్లో తప్ప మిగతా జిల్లాలలో కరెంటు వెతలు ఉండేవి. అయితే, గత పాలకులు రంజాన్, మొహర్రం వంటి పండుగలకు మాత్రమే రాష్ట్రంలో అన్ని చోట్లా పూర్తిగా కరెంటు ఇచ్చేవారు. కానీ, హోలీ, దీపావళి, దసరా పండుగలకు మాత్రం కరెంటు ఇచ్చేవారు కాదు. అంటే ముస్లిం పండుగలకు తప్ప మరెప్పుడూ వారు పూర్తిగా విద్యుత్ సరఫరా చేయలేదు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు' అన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ‘సబ్ కా సాథ్.. సబ‌్ కా వికాస్’ను నమ్ముతారని అన్నారు. 2017లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోదీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు రంజాన్ రోజున కరెంటు సరఫరా చేస్తే, దీపావళి రోజున కూడా అందించాల్సిందేనని అన్నారని యోగి గుర్తు చేశారు. కాగా, ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ కూటమిపైనా యోగి విమర్శలు చేశారు. మాయావతిని ఉద్దేశించి యోగి మాట్లాడుతూ.. శివపాల్ యాదవ్‌కు సోదరి లేదని, మరి ఈ అత్త ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.