Tej bahadur: 50 కోట్లిస్తే మోదీని చంపేస్తానన్న మాజీ జవాను తేజ్ బహదూర్.. సంచలనంగా మారిన వీడియో

  • వీడియోలో ఉన్నది తానేనని అంగీకరించిన తేజ్ బహదూర్
  • వీడియో వెనక కుట్ర ఉందన్న మాజీ జవాను
  • సంఘవిద్రోహుల వెనక కాంగ్రెస్: జీవీఎల్

ప్రధాని నరేంద్రమోదీపై వారణాసిలో పోటీకి దిగిన బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్‌‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు పెను సంచలనమైంది. తనకు రూ.50 కోట్లు ఇస్తే ప్రధాని నరేంద్రమోదీని చంపేస్తానని బహదూర్ అందులో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తేజ్ బహదూర్ సమాజ్ వాదీ పార్టీ టికెట్‌పై వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే, అతడి దరఖాస్తును ఈసీ తిరస్కరించింది.

రెండేళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న ఈ వీడియోలో ఉన్నది తానేనని తేజ్ బహదూర్ అంగీకరించాడు. అయితే, దీని వెనక కుట్ర ఉందని బహదూర్ ఆరోపించాడు. ఓ స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు ఉన్న ఈ వీడియోలో తనకు ఎవరైనా రూ.50 కోట్లు ఇస్తే మోదీని చంపేస్తానని బహదూర్ అనడం స్పష్టంగా వినిపిస్తోంది. అయితే, వీడియో రెండేళ్లనాటిది కావడంతో దాని విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియోపై బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల వెనక ఉన్నది కాంగ్రెస్సేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మోదీపై నామినేషన్ వేసిన వ్యక్తే ఆయన హత్యకు కుట్ర పన్నడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. మోదీని ఎదుర్కోలేకే ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి హింసా మార్గాలను ఎంచుకుంటున్నాయని ఆరోపించారు.  

Tej bahadur
jawan
Uttar Pradesh
Narendra Modi
varanasi
  • Loading...

More Telugu News