AAP: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎమ్మెల్యే ఝలక్

  • ఇప్పటికే అనిల్ వాజ్‌పేయి షాక్
  • బీజేపీలో చేరిన దేవిందర్ సింగ్
  • రాజకీయంగా చర్చనీయాంశమవుతున్న వలసలు

ఆమ్ ఆద్మీ పార్టీకి నేడు మరో ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చారు. తమ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరని, అది అంత సులువు కాదని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల చెప్పిన రోజు సాయంత్రమే గాంధీనగర్ ఎమ్మెల్యే అనిల్ వాజ్‌పేయి ఆప్‌కు షాక్ ఇచ్చి బీజేపీలో చేరారు. అది జరిగిన వారం రోజుల్లోనే మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. బిజ్‌వాసన్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిందర్ సింగ్ షెరావత్ ఆప్‌ను వీడి, ఢిల్లీలోని సీనియర్ బీజేపీ నాయకుల సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వలసలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

AAP
Aravind Kejriwal
New Delhi
Devinder Singh Sheravath
Anil Vajpayee
BJP
  • Loading...

More Telugu News