Andhra Pradesh: ఏపీ, తెలంగాణలు కేంద్రానికి రెండు కళ్లు లాంటివి: జీవీఎల్

  • రెండు రాష్ట్రాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేశాం
  • పెండింగ్ అంశాల పరిష్కారానికి గవర్నర్ ఉన్నారు
  • ఈసీ అనుమతి లేకుండా కేబినెట్ మీటింగా?

ఏపీ, తెలంగాణ  రాష్ట్రాలు కేంద్రానికి రెండు కళ్లు లాంటివని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేశామని చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ అంశాలను పరిష్కరించడానికి ఉమ్మడి గవర్నర్ ఉన్నారని అన్నారు. ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసింది చంద్రబాబే అని, రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్ తో చంద్రబాబు ఘర్షణ పడుతున్నారని ఆరోపించారు. ‘పోలవరం’లో తన వాటా వచ్చిందో లేదో చూసుకునేందుకే బాబు అక్కడికి వెళ్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నెల 10న ఏపీ కేబినెట్ మీటింగ్ చంద్రబాబు నిర్వహిస్తారన్న వార్తల నేపథ్యంలో జీవీఎల్ స్పందిస్తూ, ఈసీ అనుమతి లేకుండా కేబినెట్ మీటింగ్ పెట్టకూడదని అన్నారు. మహారాష్ట్ర సీఎం కూడా ఈసీ అనుమతితోనే ఇటీవల కేబినెట్ మీటింగ్ నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

Andhra Pradesh
Telangana
Bjp
gvl
Telugudesam
  • Loading...

More Telugu News