Krishna District: కల్లు తాగిన కోతిలా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడాడు: వల్లభనేని వంశీ

  • నిన్నటి వరకూ ఈ వివాదం గురించి  పట్టించుకోలేదు
  • వెంకట్రావు మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉంది
  • వైసీపీ వాళ్లు అల్లరి మూక

కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుల మధ్య వివాదం ముదురుతోంది. ఈరోజు ఉదయం వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వంశీ ఘాటుగా స్పందించారు. కల్లు తాగిన కోతిలా వెంకట్రావు మాట్లాడాడని, అందుకే, తాను మాట్లాడాల్సి వస్తోందని అన్నారు.

నిన్నటి వరకూ ఈ వివాదం గురించి పెద్దగా పట్టించుకోలేదని, నియోజకవర్గంలో ఇద్దరం కలసి పనిచేద్దామని చెబుదామని అనుకున్నానని అన్నారు. అయితే, ఈరోజు ఆయన మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉండటంతో తాను మళ్లీ పదేళ్లు వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. కొద్దిగా మత్తు దిగిన తర్వాత వెంకట్రావుకు వాస్తవ పరిస్థితి అర్థమౌతుందని చెప్పారు. వైసీపీ వాళ్లు అల్లరి మూక అని, వారి నాయకత్వమే అలా ఉంటుందని విమర్శించారు. వైసీపీ నేతలు బాహుబలి సినిమాలో కాలకేయ లాంటి వాళ్లని దుమ్మెత్తిపోశారు. 

Krishna District
Gannavaram
Telugudesam
vallabhaneni
  • Loading...

More Telugu News