KCR: ఆయన యాత్రలు రాజకీయ యాత్రలు కావు... తీర్థయాత్రలు : దాసోజు

  • రాష్ట్రంలోని కమ్యూనిస్టులకు మద్దతివ్వరు
  • జాతీయస్థాయి నేతలతో పొత్తులకు సిద్ధం
  • కేసీఆర్ కంటున్నవి పగటి కలలు

తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ మద్దతుదారని, ఆయనతో కలిసి వెళ్లలేమని జాతీయ నేతలే తెగేసి చెబుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, సారు, కారు, ఆరు దగ్గరే టీఆర్ఎస్ ఆగిపోతుందని శ్రవణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలోని కమ్యూనిస్టులకు మద్దతివ్వని కేసీఆర్, జాతీయ స్థాయి కమ్యూనిస్టు నేతలతో పొత్తులకు సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్ చేసేవి రాజకీయ యాత్రలు కావని, తీర్థయాత్రలని శ్రవణ్ పేర్కొన్నారు.

KCR
Dasoju Sravan
Federal Front
Communist Leaders
BJP
  • Loading...

More Telugu News