chandragiri: చంద్రగిరిలో అధికారుల అవకతవకలపై ఫిర్యాదు చేశాం: చెవిరెడ్డి భాస్కరరెడ్డి

  • సీఈవో, సీఎస్ ను కలిశాను 
  • అధికారుల తప్పులతో దళితులు ఓట్లు వేయలేకపోయారు
  • అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలి

చంద్రగిరిలో అధికారుల అవకతవకలపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి ఫిర్యాదు చేశామని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఏపీ సచివాలయంలో సీఈవో ద్వివేదిని, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఈరోజు ఆయన కలిశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, అధికారుల తప్పుల వల్ల దళితులు తమ ఓట్లు వేయలేకపోయారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్టు చెప్పారు. 

chandragiri
chevireddy
bhasker reddy
YSRCP
  • Loading...

More Telugu News