Andhra Pradesh: ఏపీలో డీఎస్పీ పదోన్నతులపై విచారణకు ఆదేశించాలి: గవర్నర్ కు విజయసాయిరెడ్డి లేఖ

  • సామాజిక వర్గమే ప్రాతిపదికగా డీఎస్పీ పదోన్నతులు 
  • సీనియార్టీని పరిగణనలోకి తీసుకోలేదు
  • అడ్డదారిలో ప్రమోషన్లు కల్పించారు

సామాజిక వర్గమే ప్రాతిపదికగా జరుగుతున్న డీఎస్పీ పదోన్నతుల వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ కు ఆయన ఓ లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఒకే సామాజిక వర్గానికి చెందిన 37 మందికి డీఎస్పీలుగా పోస్టింగ్స్ ఇచ్చారని, సీనియార్టీని పరిగణనలోకి తీసుకోకుండా అడ్డదారిలో ప్రమోషన్లు కల్పించారని ఆరోపించారు. పదోన్నతుల్లో పాటించాల్సిన రొటేషన్ రూల్స్ ఉల్లంఘించారని, విచారణలో ఆరోపణలు రుజువు అయితే ప్రమోషన్లు రద్దు చేయాలని ఆయన కోరారు.  

Andhra Pradesh
govener
YSRCP
mp
vijayasai
  • Loading...

More Telugu News