mamata banerjee: ఆయన కాలం చెల్లిపోయిన ప్రధాని... అందుకే ఆయన ఫోన్ కు స్పందించలేదు: మమతా బెనర్జీ

  • కావాలనే మోదీ ఫోన్లకు స్పందించలేదు
  • మోదీ ఇచ్చే తుపాను సాయం మాకు అక్కర్లేదు
  • గతంలో తుపాన్లు వచ్చినప్పుడు ఆయన ఇచ్చింది ఏమీ లేదు

ఫణి తుపానుపై చర్చించేందుకు ప్రధాని మోదీ చేసిన ఫోన్లకు తాను కావాలనే స్పందించలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మోదీ కాలం చెల్లిపోయిన ప్రధాని అని... ఆయనతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. మోదీ పదవీకాలం ముగిసిపోయిందని... మళ్లీ ఆయన ప్రధాని కాలేరని చెప్పారు.

ప్రధాని తనకు ఫోన్ చేసిన సమయంలో తాను ఖరగ్ పూర్ లో ఉన్నానని... తుపాను పరిస్థితిపై సమీక్షించేందుకు వెళ్లానని తెలిపారు. అదే సమయంలో మోదీ మాత్రం ఎన్నికల ప్రచారంలో ఉన్నారని ఎద్దేవా చేశారు.  

మోదీ ప్రభుత్వం ఇచ్చే తుపాను సాయం తమకు అవసరం లేదని ఈ సందర్భంగా మమతా బెనర్జీ కుండబద్దలు కొట్టారు. గతంలో తుపాన్లు వచ్చినప్పుడు పశ్చిమబెంగాల్ కు మోదీ చేసిన సాయం ఏమీ లేదని విమర్శించారు.

mamata banerjee
modi
fani
bjp
tmc
  • Loading...

More Telugu News