jarkhand: జార్ఖండ్ లో భార్యతో కలిసి ఓటేసిన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని!

  • నేడు ఐదో విడత పోలింగ్
  • మొత్తం 51 స్థానాలకు ఎన్నికలు
  • సాక్షితో కలిసి ఓటేసిన మిస్టర్ కూల్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు ఐదో విడత పోలింగ్ దేశవ్యాప్తంగా జరుగుతోంది. 7 రాష్ట్రాల్లోని 51 నియోజక వర్గాల ప్రజలు తమ అభ్యర్థులను ఎన్నుకునేందుకు భారీగా క్యూ లైన్లలో నిల్చున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని, ఆయన భార్య సాక్షి సింగ్ ధోనిలు ఈరోజు ఓటు వేశారు.

జార్ఖండ్ లోని రాంచీలో ఉన్న జవహర్ విద్యా మందిర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వీరిద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. అనంతరం ఓటేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, రాజస్థాన్‌ లో 12, మధ్యప్రదేశ్‌ లో 7, పశ్చిమ బెంగాల్‌ లో 7, బిహార్‌లో 5, జార్ఖండ్‌ 4, జమ్ముకశ్మీర్‌లో 2 లోక్ సభ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి.

jarkhand
wife
mahendra singh dhoni
vote
loksabha election
ranchi
  • Loading...

More Telugu News