mamata banerjee: రెండు సార్లు ఫోన్ చేసినా మాట్లాడలేదు... ఆమెకు అంత అహంకారం!: మమతా బెనర్జీపై మోదీ విమర్శ

  • ఫణి తుపాను గురించి మాట్లాడేందుకు మమతకు ఫోన్ చేశా
  • మాట్లాడేందుకు ఆమె తిరస్కరించారు
  • తుపానును కూడా రాజకీయం చేసేందుకు యత్నించారు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఫణి తుపాను నేపథ్యంలో మమత దీదీతో మాట్లాడేందుకు తాను రెండు సార్లు ఫోన్ చేశానని... ఆమె తనతో మాట్లాడేందుకు తిరస్కరించారని చెప్పారు. ఆమెకు అంత అహంకారం ఉందని దుయ్యబట్టారు. ఫణి తుపానును కూడా రాజకీయం చేసేందుకు స్పీడ్ బ్రేకర్ వంటి మమత యత్నించారని విమర్శించారు.

తాను ఫోన్ చేసిన తర్వాత మమత తిరిగి తనకు ఫోన్ చేస్తారని అనుకున్నానని... కానీ ఆమె నుంచి తనకు ఫోన్ రాలేదని మోదీ అన్నారు. అయినా పట్టించుకోకుండా, తాను మరోసారి ఆమెకు ఫోన్ చేశానని... రెండోసారి కూడా ఆమె తనతో మాట్లాడలేదని చెప్పారు. తుపాను నేపథ్యంలో బెంగాల్ ప్రజల కోసం తాను ఎంతో ఆందోళన చెందానని... అందుకే మమతతో మాట్లాడేందుకు యత్నించానని అన్నారు. కానీ, ఆమె రాజకీయాలకే ప్రాధాన్యతను ఇచ్చారని విమర్శించారు.

mamata banerjee
modi
fani cyclone
bjp
tmc
  • Loading...

More Telugu News