Tamil Nadu: తమిళనాడులోని అన్నా డీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టులో ఊరట
- స్పీకర్ జారీచేసిన అనర్హత నోటీసులపై స్టే విధించిన కోర్టు
- దినకరన్ పార్టీకి అనుకూలంగా ఉంటున్న ఎమ్మెల్యేలు
- దీంతో అనర్హత వేటు వేసిన స్పీకర్
తమిళనాడుకు చెందిన ముగ్గురు అన్నా డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలకు దేశ అత్యున్నత న్యాయ స్థానంలో ఊరట లభించింది. వారిపై స్పీకర్ విధించిన అనర్హత నోటీసులపై కోర్టు స్టే విధించింది. జయలలిత మృతి అనంతరం రాష్ట్రంలో రాజకీయ అలజడి రేగిన విషయం తెలిసిందే.
అప్పటి వరకు అన్నా డీఎంకే కోశాధికారి బాధ్యతలు నిర్వహించిన జయలలిత స్నేహితురాలు శశికళ మేనల్లుడు, టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. బయటకు వెళ్లిపోయిన ఆయన ఏఎంఎంకే పార్టీని స్థాపించుకున్నారు. ఆయన పార్టీకి మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలపై అన్నా డీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా పేర్కొంటూ స్పీకర్ ధనపాల్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు స్పీకర్ నోటీసులపై స్టే విధించింది.