poonam sinha: నేను ఎవరి భార్యను అనుకుంటున్నారు?: మీడియాకు పూనం సిన్హా కౌంటర్

  • లక్నో నుంచి పోటీ చేస్తున్న శత్రుఘ్న సిన్హా భార్య
  • రాజ్ నాథ్ సింగ్ పై పోటీ
  • గెలుపు నాదేనంటూ ధీమా

ఉత్తరప్రదేశ్ లక్నో నియోజకవర్గంలో గెలుపు తనదేనని సినీ నటుడు శత్రుఘ్న సిన్హా భార్య, మాజీ మిస్ ఇండియా పూనం సిన్హా ధీమా వ్యక్తం చేశారు. 2014కు, ఇప్పటి ఎన్నికలకు చాలా తేడా ఉందని ఆమె అన్నారు. తాను ప్రచారం నిర్వహించిన అన్ని ప్రాంతాల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే విషయం అర్థమయిందని చెప్పారు. కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన రాజ్ నాథ్ సింగ్ పై ఆమె ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆచార్య ప్రమోద్ బరిలోకి దిగారు. శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ తరపున బిహారులో పోటీ చేస్తున్నప్పటికీ, ఈ నియోజకవర్గంలో మాత్రం తన భార్య తరపున ప్రచారాన్ని నిర్వహించారు.

ఎన్నికల నేపథ్యంలో అధైర్యపడుతున్నారా? అని పూనంను మీడియా ప్రశ్నించగా... ఆమె దీటుగా సమాధానమిచ్చారు. 'నేను ఎవరి భార్యను? ఆత్మవిశ్వాసానికి మరో పేరైన శత్రుఘ్నసిన్హా భార్యను. ఆయన ఆత్మవిశ్వాసంలో కొంత భాగం నాలో కూడా ఉంది. నేను పెద్ద యుద్ధంలో ఉన్నా. విజేతగా నిలుస్తా' అంటూ ధీమా వ్యక్తం చేశారు.

poonam sinha
shatrughan sinha
rajnath singh
lucknow
  • Loading...

More Telugu News